ట్రెజరీశాఖకు బ్యాలెట్ పత్రాలు
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:35 AM
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ పత్రాలను ట్రంకు పెట్టెల్లో భద్ర పరచి ట్రెజరీశాఖకు అప్పగించారు.
ఏలూరు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ పత్రాలను ట్రంకు పెట్టెల్లో భద్ర పరచి ట్రెజరీశాఖకు అప్పగించారు. కలెక్టరే ట్‌లోని ట్రెజరీ కార్యాలయంలోని ఓ గదిలో ఈ పత్రాలను ఆర్నెళ్ల పాటు భద్రపరు స్తారు. వీటిని బుధవారం తెల్లవారు జామున ట్రెజరీశాఖ పర్యవేక్షణలో వాటిని స్వీకరించి ఆ రూమ్‌కు సీల్ వేశారు. ఎవ రైనా ఎన్నికపై ఛాలెంజ్ చేసే పరిస్థితి వస్తే, వీటిని బయటకు తీస్తారు. లేకపోతే ఆరు నెలలు తర్వాత ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసు కుంటారు. వివిధ జిల్లాల నుంచి తీసు కొచ్చిన బ్యాలెట్ బాక్సులను జడ్పీ సీఈవో కె.సుబ్బారావు పర్యవేక్షణలో ఖాళీ బాక్సుల ను ఆయా జిల్లాలకు తరలింపు ప్రక్రియ ను అధికారులు పూర్తి చేశారు.