Vamsi Bail Update: వంశీ బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:26 AM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ బెయిల్‌పై ప్రాసిక్యూషన్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోవిచారణను గురువారానికి వాయిదా వేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం
విజయవాడ, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): విజయవాడ జిల్లా జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ప్రాసిక్యూషన్స్ తరఫున న్యాయవాదులు కౌంటర్ పిటిషన్‌ను మంగళవారం దాఖలు చేశారు. తదుపరి విచారణను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది. గతంలో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులోనూ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.