బాబు పవర్..!
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:41 PM
డిప్యూటీ సీఎం కొణిదెల పవనకళ్యాణ్ పిన్నాపురం ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక (రెన్యూవబుల్) ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ)ను తాజాగా సందర్శించారు. రాళ్ల సీమలో నిర్మించిన అద్భుతమైన పవర్ ప్రాజెక్టు.. సీఎం చంద్రబాబు నిదర్శనం..

చంద్రబాబు హయాంలోనే పిన్నాపురం ఐఆర్‌ఈ ప్రాజెక్టు
4,766.28 ఎకరాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు శ్రీకారం
2018 ఫిబ్రవరిలో గ్రీనకోతో ఒప్పందం.. జూలై 19న జీఓ జారీ
నిర్మాణ సమయంలో 15 వేల మందికి ఉపాధి
3 వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి
దుష్ప్రచారానికి తెరతీసిన వైసీపీ
కర్నూలు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం కొణిదెల పవనకళ్యాణ్ పిన్నాపురం ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక (రెన్యూవబుల్) ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ)ను తాజాగా సందర్శించారు. రాళ్ల సీమలో నిర్మించిన అద్భుతమైన పవర్ ప్రాజెక్టు.. సీఎం చంద్రబాబు నిదర్శనం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ తరువాత అత్యంత ప్రాధాన్యత ‘గ్రీన ఎనరీ’్జకి ఇస్తున్నారంటూ వపన వివరించారు. అయితే పవన అటు వెళ్లగానే వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. తమ అనుకూలమైన బ్లూమీడియాలో అసత్య కథనాలకు తెరతీశారు. పిన్నాపురం పవర్ ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైందని, 2002 మే 17న సీఎం హోదాలో వైఎస్ జగన ప్రారంభించేశారంటూ ఆ కథనాల సారాంశం. కానీ అవన్నీ శుద్ధ అబద్ధాలేనని తేలిపోయాయి. రాష్ట్ర విభజన తరవాత రాయలసీమ కరువు ప్రాంతంలో గ్రీన ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకురావాలని అప్పటి సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఆసియాలోనే అతిపెద్ద వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత (సోలార్ పవర్) యూనిట్ ఓర్వకల్లు, గని గ్రామాల మధ్య ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ప్రప్రథమ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు విశాఖ కేంద్రంగా 2018 ఫిబ్రవరి 24-26 మధ్య జరిగిన ‘ఏపీ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2018’లో బీజం వేశారు. అదే ఏడాది పిన్నాపురం-గుమ్మటంతండా గ్రామాల మధ్య సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ (హైడ్రో) పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం గ్రీనకో ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (గ్రీనకో గ్రూప్)కు అనుమతులు మంజూరు చేస్తూ జీవో ఎంఎస్ నంబరు.24 జారీ చేశారు. నాలుగేళ్లలో పూర్తి చేసేలా ప్రభుత్వం ఆ కంపెనీ యాజమాన్యంతో ఒప్పందం చేసుకుంది. 2019 మేలో ఏర్పడిన జగన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూడేళ్లు ఆలస్యమైంది.
రాష్ట్ర విభజన తరువాత అత్యంత వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అప్పటి సీఎం చంద్రబాబు ఓర్వకల్లు కేంద్రంగా 33 వేల ఎకరాల్లో పారిశ్రామికవాడ (ఇండసి్ట్రయల్ హబ్) ఏర్పాటు చేశారు. ఓర్వకల్లు, గని గ్రామాల్లో ఆసియా దేశాల్లోనే అతిపెద్ద వెయ్యి మెగావాట్ల సామర్థ్యంలో ‘అలా్ట్ర మెగా సోలార్ పార్క్’ నిర్మాణానికి 2015-16 మధ్యలో ఆనాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రీనకో కంపెనీ 500 మెగావాట్లు, స్టాఫ్ బ్యాంక్ ఎనర్జీ సంస్థ 350 మెగావాట్లు, అజూద్ పవర్ కంపెనీ 100 మెగావాట్లు, అదానీ గ్రూప్ 50 మెగావాట్లు సౌర విద్యుత ఉత్పత్తి లక్ష్యం. దాదాపు 24 చదరపు కిలోమీటర్లు ఆ సోలార్ పార్క్ విస్తరించింది. 2017 అక్టోబరు 5 నాటికే దాదాపు 806.072 మిలియన యూనిట్లు సోలార్ పవర్ ఉత్పత్తి సాధించి సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఓర్వకల్లు ఇండసి్ట్రయల్ హబ్‌లో ‘జైరాజ్ ఇస్పాత ఐరన పరిశ్రమ’ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. కర్నూలు జిల్లాకు పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు రావాలంటే విమానయాన సౌకర్యం ఉండాలని 1,110 ఎకరాల్లో రూ.110 కోట్లతో కర్నూలు (ఓర్వకల్లు) విమాశ్రయం నిర్మాణానికి శ్రీకారం చుట్టి కేవలం 18 నెలల్లో పూర్తి చేసి మరో రికార్డును అందుకున్నారు.
ఫ గత టీడీపీ ప్రభుత్వంలో శ్రీకారం
ప్రపంచంలోనే ప్రప్రథమంగా సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ (హైడ్రో) పవర్ ప్రాజెక్టు స్థాపించాలని గత టీడీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిన ఆలోచన. పలు గ్రీన ఎనర్జీ కంపెనీలతో పలుమార్లు చర్చించారు. సనరైజ్ ఆంధ్రప్రదేశ ఇన్వెస్ట్‌మెంట్ మీట్‌లో భాగంగా 2018 అక్టోబరు 24 నుంచి 26 వరకు విశాఖ కేంద్రంగా ‘ఏపీ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2018’ను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్వహించింది. అప్పటి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశప్రభు, సీఎం చంద్రబాబులు ఈ సమ్మిట్‌ను ప్రారంభించారు. ఆ సమ్మిట్‌లో పిన్నాపురం ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక (రెన్యూవబుల్) ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) నిర్మాణానికి బీజం పడింది. 2,750 మెగావాట్ల సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ పవర్ ఉత్తత్పి ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీనకో ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (గ్రీనకో గ్రూప్) ప్రతినిధులతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంత్రివర్గం ఆమోదం తరువాత 2,750 మెగావాట్లు (1,000 మెగావాట్లు సోలార్ పవర్, 550 మెగావాట్లు విండ్ పవర్, 1,200 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్ వపర్) ఉత్పత్తి లక్ష్యంతో గ్రీనకో కంపెనీకి పాణ్యం మండలం పిన్నాపురం, ఓర్వకల్లు మండలం హుసేనాపురం, బ్రాహ్మణపల్లి, కాల్వ, గుమ్మటంతండా గ్రామాల్లో మార్కెట్ విలువకు 4,766.28 ఎకరాలు, గోరుకల్లు రిజర్వాయరు నుంచి ఒక టీఎంసీలు నీటిని గ్రీనకో కంపెనీకి కేటాయిస్తూ.. 2018 జూలై 19న జీఓ ఎంఎస్ నంబరు.24ను ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీఓను నాటి విద్యుత శాఖ, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్‌జైన జారీ చేశారు. 2,750 మెగావాట్ల నుంచి తరువాత 5,230 మెగావాట్లకు పెంచారు. నిర్మాణ సమయంలో 15 వేల మందికి, ప్రాజెక్టు ప్రారంభమైన తరువాత 3 వేల మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలి. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో అంటే 2022 ఆఖరీలోగా పూర్తి చేయాలని, లేనిపక్షంలో కంపెనీకి కేటాయించిన మొత్తం భూమిని వెనక్కి తీసుకంటామని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసి ఆ వెంటనే పనులు మొదలు పెట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసిన గ్రీనకో కంపెనీ వివిధ నిర్మాణాలు పూర్తి చేసింది.
ఫ జగన హయాంలో నిండా నిర్లక్ష్యం
2019 మేలో జగన సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో పిన్నాపురం ఐఆర్‌ఈసీ ప్రాజెక్టుకు శాపంగా మారింది. అప్పటికే జోరుగా సాగుతున్న పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గ్రీనకో గ్రూప్ యాజమాన్యం పలుమార్లు వైసీపీ ప్రభుత్వ పెద్దలను కలసినా పనులు ప్రారంభించేందుకు మొదట్లో అనుమతి ఇవ్వలేదు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టును కొనసాగించేందుకు జగన ప్రభుత్వం ఒప్పుకుంటూ ఉత్తర్వులు ఇవ్వడంతో గ్రీనకో కంపెనీ పనులను పునఃప్రారంభించింది. 2022 మే 17న నాటి సీఎం జగన సిమెంట్ పనులకు శంకుస్థాపన చేశారు. టీడీపీ ప్రభుత్వంలోనే గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని తరలించే కాలువ, లోయర్ రిజర్వాయర్, అప్పర్ రిజర్వాయర్, పవర్ హౌస్ నిర్మాణం మట్టి పనులు జరిగాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా యథావిధిగా పనులు కొనసాగించి ఉంటే ఒప్పందం మేరకు 2022 ఆఖరు నాటికి పనులు పూర్తి జరిగి విద్యుత ఉత్పత్తి మొదలయ్యేది. జగన నిర్లక్ష్యం వల్ల మూడేళ్లు జాప్యం జరిగింది.
ఫ చంద్రబాబు విజనకు నిరద్శనం
- టీజీ భరత, రాష్ట్ర పరిశ్రల శాఖ మంత్రి, కర్నూలు
సీఎం చంద్రబాబు విజన వల్లే పిన్నాపురం ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక (రెన్యూవబుల్) ఎనర్జీ ప్రాజెక్టు ఓర్వకల్లులో ఏర్పాటైంది. 2014లో రాష్ట్ర విభజన తరువాత నాటి సీఎం చంద్రబాబు గ్రీన ఎనర్జీకి అత్యంత ప్రాధాన్య ఇచ్చారు. ఆసియాలోనే అతిపెద్ద వెయ్యి మెగావాట్ల అలా్ట్ర మెగా సోలార్ పార్క్‌ను ఓర్వకల్లు కేంద్రంగా ఏర్పాటు చేశారు. 2018లో 5,230 మెగావాట్ల సామర్థ్యంతో ఐఆర్‌ఈసీ ప్రాజెక్టుకు గ్రీనకో కంపెనీతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ వెంటనే జీఓ ఇచ్చి పనులు కూడా ప్రారంభించారు. వాస్తవాలను వక్రీకరించి ఇది జగన తీసుకొచ్చిన ప్రాజెక్టు అంటూ బ్లూ మీడియా, కొందరు వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టుకు ఎన్నో ఇబ్బందులు సృష్టించారు.