Share News

Avanti Institute: అవంతి కళాశాలకు అటానమస్‌ హోదా

ABN , Publish Date - May 14 , 2025 | 06:17 AM

రంగారెడ్డి జిల్లా గుంతపల్లిలోని అవంతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలకు యూజీసీ అటానమస్‌ హోదా కాబట్టిన సందర్భంగా కళాశాల చైర్మన్‌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఈ హోదా వల్ల ప్లేస్‌మెంట్‌ అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. 10 సంవత్సరాలు ఈ హోదా కొనసాగుతుందని వివరించారు.

Avanti Institute: అవంతి కళాశాలకు అటానమస్‌ హోదా

అబ్దుల్లాపూర్‌మెట్‌, మే 13 (ఆంధ్రజ్యోతి) : అటానమస్‌ హోదాతో ప్లేస్‌మెంట్‌ అవకాశాలు మెరుగవుతాయని మాజీ మంత్రి, అవంతి కళాశాల చైర్మన్‌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గుంతపల్లిలోని అవంతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలకు యూజీసీ అటానమస్‌ హోదాను కల్పించిందని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 2034-35 సంవత్సరం వరకు 10 ఏళ్ల పాటు ఈ హోదా కొనసాగుతుందని పేర్కొన్నారు. హోదా వచ్చిన సందర్భంగా మంగళవారం కళాశాలలో అధ్యాపక బృందంతో కలిసి ఆయన కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మాట్లాడుతూ..దశాబ్దాల కాలంగా తమ విద్యాసంస్థల ద్వారా లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో యూనివర్సిటీ హోదానూ సాఽధిస్తామన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ జయప్రద, ప్రిన్సిపాల్స్‌ శేషతల్పసాయి, రాంచంద్రారెడ్డి, క్యాంపస్‌ ఇన్‌చార్జి బోసుబాబు, పీఆర్‌వోపాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 06:17 AM