AU Engineering Exam: రేపు ఏయూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష
ABN , Publish Date - May 04 , 2025 | 04:51 AM
రేపు (మే 5) విశాఖలో ఏయూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష (ఆఈట్-2025) జరుగుతుంది. 5,948 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు
విశాఖపట్నం, మే 3(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కోర్సుల్లో (సెల్ఫ్ సపోర్టు) ప్రవేశాలకు ఏయూ అధికారులు ఈ నెల ఐదో తేదీన ఆఈట్-2025ను నిర్వహించనున్నారు. పరీక్షకు మొత్తం 5,948 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.