Nimmala Attack Case: నిమ్మలపై దాడి కేసు సీఐడీకి అప్పగింత
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:23 AM
మంత్రి నిమ్మల రామానాయుడుపై గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడికి సంబంధించిన కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.
గత వైసీపీ ప్రభుత్వంలో కేసు నమోదు చేయని పోలీసులు
పాలకొల్లు, జూలై 24(ఆంధ్రజ్యోతి): మంత్రి నిమ్మల రామానాయుడుపై గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడికి సంబంధించిన కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఘటనపై అప్పట్లో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వైసీపీ రాజకీయ ప్రమేయంతో కేసు నమోదు చేయలేదు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి రాగానే కేసు నమోదు చేశారు. లోతుగా దర్యాప్తు జరిపేందుకు తాజాగా ఆ కేసును సీఐడీకి బదలాయిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ సీఐడీ డీఎస్పీ మోహన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేశారు. 2022లో వైసీపీ ప్రభుత్వం పాలకొల్లు పట్టణంలోటిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆ సభకు అధ్యక్షత వహించాల్సి ఉంది. అధికారుల ఆహ్వానం మేరకు సభావేదికపైకి వచ్చిన నిమ్మల రామానాయుడు, అప్పటి ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌లను వైసీపీ నాయకులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. నిమ్మలకు రక్షణగా నిలిచిన వారిపై కూడా భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో వైసీపీ కార్యకర్తలు ఉపయోగించిన బటన్ నైఫ్‌ను నాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అప్పట్లో స్థానిక పోలీస్ స్టేషన్‌లోనూ, డీజీపీ, డీఐజీ, ఎస్పీ, కలెక్టర్‌లకు రామానాయుడు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదు. పైగా నాటి ప్రభుత్వం బాధితులపైనే కేసులు నమోదు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News