Share News

Atluri Mounika: అమెరికాలో మెరిసిన కృష్ణా ఆడపడుచు

ABN , Publish Date - Jun 02 , 2025 | 06:20 AM

అమెరికాలో జరిగిన మిసెస్ తెలుగు యూఎస్‌ఏ పోటీలో గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. మౌనిక సివిల్ ఇంజినీరింగ్ చేసి, ప్రస్తుతం అమెరికాలో శాశ్వత ఉద్యోగిగా సేల్స్‌ఫోర్స్ కంపెనీలో పని చేస్తున్నారు.

Atluri Mounika: అమెరికాలో మెరిసిన కృష్ణా ఆడపడుచు

మిసెస్‌ తెలుగు యూఎ్‌సఏ విజేతగా అట్లూరి మౌనిక

స్వగ్రామం పామర్రు మండలం ఐనంపూడి

గుడివాడ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి) : అమెరికాలో జరిగిన మిసెస్‌ తెలుగు యూఎ్‌సఏ విజేతగా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక నిలిచారు. మే 26న జరిగిన మిస్‌ అండ్‌ మిసెస్‌ తెలుగు యూఎ్‌సఏ పోటీల్లో పాల్గొన్న 25 మందిలో మౌనిక ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మౌనికకు గత విజేత శ్రేయ బొప్పన కీరిటాన్ని అలంకరించారు. మౌనిక బీఈ సివిల్‌ ఇంజనీరింగ్‌ చేసి, హైదరాబాదులో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో వివాహం అనంతరం అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం అమెరికాలోని సేల్స్‌ఫోర్స్‌లో శాశ్వత ఉద్యోగిగా ఉన్నారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. మౌనిక తండ్రిదండ్రులు అట్లూరి కృష్ణప్రసాద్‌, శైలజ. వీరి స్వగ్రామం పామర్రు మండలం ఐనంపూడి కాగా, ప్రస్తుతం గుడివాడలో నివాసముంటున్నారు.


ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 06:20 AM