Share News

ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:08 AM

ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్‌.మునెప్ప డిమాండ్‌ చేశారు.

   ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలి

కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్‌.మునెప్ప డిమాండ్‌ చేశారు. ఆదివారం ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఆశా కార్యకర్తల ముఖ్య సమావేశం ఆశా కార్యకర్తల యూనియన జిల్లా నాయకురాలు రమీజాబి అధ్యక్షతన నిర్వహించారు. మునెప్ప మాట్లాడుతూ కార్యకర్తలను మెడికల్‌ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్‌ చేయాలన్నారు. 8 గంటల పనివిఽధానం అమలు చేయాలన్నారు. ఆశాలకు రికార్డులు, నాణ్యమైన యూనిఫామ్‌ సరఫరా చేయాలన్నారు. ఆశా కార్యకర్తల విధి నిర్వహణంలో మరణిస్తే రూ. 5 లక్షలు చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రమాద బీమా రూ.10 లక్షలు గ్రూప్‌ ఇన్సూరెన్సు ఉచితంగా కల్పించాలన్నారు. సమావేశంలో యూనియన నాయకులు రాధిక, నాగవేణి, ఆరుణ, అనిత, హైమావతి, సుజాత, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:08 AM