Share News

Araku Chali Utsav: ముగిసిన అరకు చలి ఉత్సవ్‌

ABN , Publish Date - Feb 03 , 2025 | 05:49 AM

ఉత్సవాల వేదికైన స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక రకాల చేతి వృత్తుల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లు స్థానికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Araku Chali Utsav: ముగిసిన అరకు చలి ఉత్సవ్‌

అరకులోయ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అరకు చలి ఉత్సవ్‌ ఆదివారం ఘనంగా ముగిసింది. కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఢంకా మోగించి ఉత్సవానికి ముగింపు పలికారు. ఉత్సవాల వేదికైన స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక రకాల చేతి వృత్తుల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లు స్థానికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవ్‌ ఆఖరి రోజు ఉదయం అరకులోయ మండలం సుంకరమెట్ట కొండలపై ట్రెకింగ్‌, గిరిజన మ్యూజియం ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.

Updated Date - Feb 03 , 2025 | 05:49 AM