Aqua Licensing Made Easier: ఆక్వా లైసెన్సుల ప్రక్రియ సులభతరం
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:17 AM
రాష్ట్రంలో ఆక్వా సాగుకు లైసెన్సుల జారీ ప్రక్రియను సులభతరం చేశామని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి..
అప్సడా చట్ట ప్రకారం సాగు ధ్రువీకరణ తప్పనిసరి
అమెరికా సుంకాలపై కేంద్రంతో సీఎం చర్చలు: మంత్రి అచ్చెన్న
అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆక్వా సాగుకు లైసెన్సుల జారీ ప్రక్రియను సులభతరం చేశామని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆక్వా రైతులు ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు రొయ్యలు, చేపల చెరువులను ఏపీఎ్‌సఏడీఏ చట్టం కింద ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఏపీ ఆక్వాకల్చర్ డెవల్‌పమెంట్ అథారిటీ(అప్సడా) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆక్వా రైతులకు మేలు జరిగేలా అమెరికా సుంకాల భారంపై సీఎం చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. సుంకం తక్కువ ఉన్న దేశాలకు రొయ్యల్ని ఎగుమతి చేస్తే రైతులకు నష్టం వాటిల్లదన్నారు. రొయ్యల రైతులకు కూటమి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీ పట్టా, అసైన్డ్, సీజేఎ్‌ఫఎస్ భూముల్లో చేపలు పెంచే రైతులు అప్సడా చట్టం ప్రకారం సాగు ధ్రువీకరణ పత్రాన్ని పొందితే ప్రభుత్వ ప్రయోజన పథకాల పరిధిలోకి వస్తారని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో రొయ్యలు, చేపలకు ఆహారంగా వాడుతున్న పౌల్ర్టీ, ఇతర జంతువుల వ్యర్థాలు నీటి కాలుష్యానికి, ప్రజారోగ్యానికి హానికరమైనందున వీటిని తక్షణం నిలిపివేయాలని, లేకపోతే ఏపీ ఫిష్ ఫీడ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మహిళా మత్స్యకారులకు జీవనోపాధి లక్ష్యంగా సముద్ర నీటిలో, జలాశయాల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించడానికి మారికల్చర్ విధానం, రిజర్వాయర్ కేజ్ కల్చర్ విధానాన్ని ఆమోదించింది. ‘రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా 5 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి పెంచే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. అదనంగా సముద్ర తీర ప్రాంతాల్లో 4-5 ఎంపిక చేసిన ప్రదేశాల్లో సముద్ర నాచు సాగును ప్రోత్సహించాలిఈ నెల 27 నుంచి భారత రొయ్యల ఎగుమతులపై అమెరికా విధించిన 60 శాతం టారి్‌ఫలను దృష్టిలో ఉంచుకుని, సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. దక్షిణ కొరియా, యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, రష్యా, ఆఫ్రికా దేశాల్లో కొత్త ఎగుమతి మార్కెట్లను ఎంపెడా సహకారంతో అన్వేషించాలి. యూకేతో ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్‌ను వినియోగించుకోవాలి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా ఆక్వా ఎగుమతిదారులు, ప్రొసెసర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కో-ఆర్డినేషన్ కమిటీని కంపెనీ చట్టం కింద ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో ఆక్వా రంగ భాగస్వాములు సభ్యులుగా ఉండాలి’ అని నిర్ణయించారు. నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ(నెక్) తరహాలో ఈ కమిటీ దేశీయ వినియోగాన్ని పెంచేందుకు ఉపయోగపడాలి’ అని నిర్ణయించారు. కో-వై్‌సచైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి, ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్‌నాయక్ హాజరయ్యారు.