Share News

APSPDCL : సాగుకు 9 గంటలు ఉచిత విద్యుత్‌!

ABN , Publish Date - Feb 07 , 2025 | 03:58 AM

తొమ్మి ది గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్‌ అమలుకు కట్టుబడి ఉన్నామని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతోషరావు స్పష్టం చేశారు. ‘సీమలో సాగుకు ఏడు గంటలే కరెంటు!’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 9గంటల ఉచిత విద్యుత్‌

APSPDCL : సాగుకు 9 గంటలు ఉచిత విద్యుత్‌!

అమలుకు కట్టుబడి ఉన్నాం.. సీజీఎంపై చార్జిషీట్‌, బదిలీ వేటు వేశాం

ఎస్పీడీసీఎల్‌ ఉన్నతాధికారుల ఆమోదం లేకుండా వేళలు మార్చినందుకే

సీఎండీ సంతోషరావు వెల్లడి.. ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తొమ్మి ది గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్‌ అమలుకు కట్టుబడి ఉన్నామని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతోషరావు స్పష్టం చేశారు. ‘సీమలో సాగుకు ఏడు గంటలే కరెంటు!’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 9గంటల ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. సంస్థ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల పరిధిలో రైతులకు 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని చెప్పారు. వేసవి విద్యుత్‌ వినియోగానికి అనుగుణంగా వ్యవసాయనికి 9 గంటల విద్యుత్‌ సరఫరా అంశంపై జిల్లా అధికారులకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (ఆపరేషన్స్‌) ఆదేశాలిచ్చే క్రమంలో సమయ గణాంకాల్లో పొరపాట్లు దొర్లాయని, ఆ తర్వాత సవరణ ఉత్తర్వులిచ్చినా వాటిని సీజీఎం పట్టించుకోలేదని తెలిపారు. ఎస్పీడీసీఎల్‌ ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకోకుండా సరఫరా సమయాలు మార్చినందుకు సీజీఎం (ఆపరేషన్స్‌)కు చార్జిషీట్‌ ఇవ్వడంతోపాటు బదిలీ చేశామని చెప్పారు.

Updated Date - Feb 07 , 2025 | 03:58 AM