Share News

APPSC : మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేసిన ఎపీపీఎస్సీ

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:16 PM

ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ, దేవాదాయ, భూగర్భజల శాఖలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ఎపీపీఎస్సీ వెబ్ సైట్లో నోటిఫికేషన్లను పొందుపరచామని కార్యదర్శి పి. రాజాబాబు తెలిపారు.

APPSC :  మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేసిన ఎపీపీఎస్సీ
APPSC

అమరావతి, ఆగస్టు 12 : ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల నియాకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.

అటు, దేవాదాయ శాఖలో 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ఇక, భూగర్భజల శాఖలో 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి కూడా ఎపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఎపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో జాబ్ నోటిఫికేషన్లను పొందుపరిచామని ఎపీపీఎస్సీ కార్యదర్శి పి. రాజాబాబు తెలిపారు.

Updated Date - Aug 12 , 2025 | 06:38 PM