Share News

పారా లీగల్‌ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:03 AM

జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో పారా లీగల్‌ వలంటీర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నంద్యాల మండల్‌ లీగల్‌ సెల్‌ చైర్మన వాసుబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

   పారా లీగల్‌ వలంటీర్ల  నియామకానికి దరఖాస్తులు

నంద్యాల క్రైం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో పారా లీగల్‌ వలంటీర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నంద్యాల మండల్‌ లీగల్‌ సెల్‌ చైర్మన వాసుబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పారా లీగల్‌ వలంటీర్ల నియామకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జిల్లాకు చెందినవారై ఉండాలని పేర్కొన్నారు. సామాజిక సేవ, చట్ట అవగాహన, ప్రజా సంక్షేమానికి అంకితభావం ఉన్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉండాలని, పై స్థాయి విద్యార్హతలు, అనుభవం, చట్ట, సామాజిక సేవల రంగంలో పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, అంగనవాడీ కార్యకర్తలు, వైద్యులు, న్యాయ విద్యార్థులు, రాజకీయేతర సభ్యులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, సామాజిక కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నంద్యాల మండల్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ కార్యాలయాల నుంచి పొందవచ్చని సూచించారు. పూర్తిచేసిన దరఖాస్తు ఫారంతోపాటు అవసరమైన పత్రాల ప్రతులను నంద్యాల మండల్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ కార్యాలయానికి స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపాలని తెలిపారు. దరఖాస్తులను ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 5గంటలలోగా పంపించాలని పేర్కొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:03 AM