Share News

Minister Savitha: ఇంటి ముంగిటకే ఆప్కో వస్త్రాలు

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:01 AM

వినియోగదారులకు చేనేత దుస్తులను మరింత చేరువ చేయడానికి ఆప్కో ద్వారా డోర్‌ డెలివరీ సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు..

Minister Savitha: ఇంటి ముంగిటకే ఆప్కో వస్త్రాలు

  • ఈ కామర్స్‌కు అనుసంధానంగా 40 షోరూమ్‌లు: మంత్రి సవిత

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు చేనేత దుస్తులను మరింత చేరువ చేయడానికి ఆప్కో ద్వారా డోర్‌ డెలివరీ సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు. ‘అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్‌ సంస్థల ద్వారా అమ్మకాలు ప్రారంభించాం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 40 ఆప్కో షోరూమ్‌లను ఈ కామర్స్‌కు అనుసంధానించాం. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా నేతన్నలు నిలదొక్కుకోవడానికి ఈ కామర్స్‌లోకి ఆప్కో అడుగుపెట్టింది. చాలా తక్కువ కాలంలోనే ఆన్‌లైన్‌ ద్వారా రూ.45 లక్షల విలువైన చేనేత వస్త్రాల అమ్మకాలు జరిగాయి. ఈ అమ్మకాలను మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది’ అని సవిత తెలిపారు.

Updated Date - Sep 04 , 2025 | 04:01 AM