Share News

ఏప్రిల్‌ 13, 14న ఏపీసీసీబీఈఏ డైమండ్‌ జూబ్లీ సమావేశాలు

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:56 AM

ఆంధ్రప్రదేశ్‌ కో-ఆపరేటివ్‌ సెం ట్రల్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏపీసీసీబీఈఏ) ఆఫీసు బేరర్స్‌ సమావేశం ఆదివారం ఎంజీ రోడ్డులోని అసోసియేషన్‌ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

ఏప్రిల్‌ 13, 14న ఏపీసీసీబీఈఏ డైమండ్‌ జూబ్లీ సమావేశాలు

గవర్నర్‌పేట, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ కో-ఆపరేటివ్‌ సెం ట్రల్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏపీసీసీబీఈఏ) ఆఫీసు బేరర్స్‌ సమావేశం ఆదివారం ఎంజీ రోడ్డులోని అసోసియేషన్‌ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఏప్రిల్‌ 13, 14న విజయవాడ కేంద్రంగా అసోసియేషన్‌ డైమండ్‌ జూబ్లీ సమావేశా లు విజయవంతంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్‌ 60 వసంతాల్లోకి అడుగుపెడుతుండటం సంతోషదాయకమన్నారు. ట్రైడ్‌ యూనియన్‌ ఇన్నేళ్లు దిగ్విజయంగా నిర్వహి ంచడం సాధారణ విషయం కాదన్నారు. అసోసియేషన్‌ జాతీయ కార్యదర్శి మాట్లాడుతూ సహకార రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, దానికి అనుగుణంగా ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు అసోసియేషన్‌ పోరాటాలకు సిద్ధంగా ఉందన్నారు. అనంతరం దేశ ఆర్ధిక వ్యవస్థలో బ్యాంకుల ప్రాముఖ్యత, ట్రేడ్‌ యూనియన్ల పాత్ర అనే అంశంపై చర్చజరిగింది. డైమండ్‌ జూబ్లీ స మావేశాలకు సంబంధించిన రిసెప్షన్‌ కమిటీ ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ నాయకులు, ఆంధ్రప్రదేశ్‌ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆఫీసు బేరర్స్‌, అర్భన్‌ బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నాయకులు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 12:56 AM