AP Municipal Fee Structure: అపార్ట్‌మెంట్ల ఫీజులు విడతల వారీగా వసూలు
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:03 AM
రాష్ట్రంలో బహుళ అంతస్థుల భవనాలు, నగర స్థాయి మౌలిక వసతుల ఇంపాక్ట్ ఫీజు, లేబర్‌సెస్‌ను మున్సిపల్ శాఖ విడతలవారీగా వసూలు చేస్తున్న తరుణంలో...
పట్టణాల్లో భవన యజమానులకు ఊరట
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బహుళ అంతస్థుల భవనాలు, నగర స్థాయి మౌలిక వసతుల ఇంపాక్ట్ ఫీజు, లేబర్‌సెస్‌ను మున్సిపల్ శాఖ విడతలవారీగా వసూలు చేస్తున్న తరుణంలో... డెవలప్‌మెంట్, బెటర్‌మెంట్ చార్జీలను కూడా ఇదే తరహాలో వసూలు చేయాలని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ నిర్ణయం తీసుకుంది. బెటర్‌మెంట్, డెవలప్‌మెంట్ చార్జీలు రూ.15 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు ఉంటే నాలుగు సమాన వాయిదాల్లో, చార్జీలు రూ.75 లక్షలకు పైబడి ఉంటే 8 వాయిదాల్లో రెండేళ్లలోపు చెల్లించే వెసులుబాటు కల్పించింది. 12 శాతం వడ్డీతో మొత్తం చార్జీలను లెక్కించి దానిని సమాన వాయిదాల్లో విభజిస్తారు. దీంతో బహుళ అంతస్థుల యజమానులకు ఊరట కలగనుంది.