AP Tourism : కుంభమేళాకు పర్యాటక శాఖ బస్సులు
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:47 AM
కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్‌కు రెండు రూట్లలో బస్సులు నడపనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డీఎం శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రజలకు

11, 12 తేదీల్లో రెండు మార్గాల్లో అందుబాటులోకి
నెల్లూరు(సాంస్కృతికం), జనవరి 30(ఆంధ్రజ్యోతి): కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్‌కు రెండు రూట్లలో బస్సులు నడపనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డీఎం శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఈ బస్సులను నడుపుతామని పేర్కొన్నారు. ఇందులో ఓ బస్సు తిరుపతి, ఒంటిమిట్ట, కడప బైపాస్, ఓర్వకల్లు, కర్నూల్ బైపాస్, హైదరాబాద్, జబల్‌పూర్, చిత్రకూటం, కాశీ, నాగపురి ధర్మపురి మీదుగా ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బస్సు ఫిబ్రవరి 11 ఉదయం 6గంటలకు తిరుపతిలో బయలుదేరుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు సీఆర్‌వో, తిరుపతి, 98480 07033, కడప డీజీఎం 90103 18811, కర్నూలు డీవీఎం 96401 77759, హైదరాబాద్ ఐఆర్‌వోలను సంప్రదించాలని తెలిపారు. రెండో రూట్ బస్సు ఫిబ్రవరి 12న ఉదయం 6గంటలకు నెల్లూరు రాజరాజేశ్వరి ఆలయం నుంచి బయలుదేరుతుందన్నారు. ఈ బస్సు నెల్లూరు నుంచి విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం, పూరి, కోణార్క్, భువనేశ్వర్, కటక్, చండీపూర్, గయ, బుద్ధగయ, కాశీ, ప్రయాగ్‌రాజ్‌కు వెళుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు నెల్లూరు డీవీఎం 98480 07024, విజయవాడ సీఆర్‌వో 98480 07025, ఐఆర్‌వో రాజమండ్రి 98486 29341, విశాఖపట్నం సీఆర్‌వో 98488 13584, 98480 07022లను సంప్రదించాలన్నారు. టికెట్ల రిజర్వేషన్ www. aptde.in లేదా turijamapgov.in ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.