Minister Narayana: ఈఏడాది చివరికి చెత్త రహిత రాష్ట్రం: నారాయణ
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:09 AM
ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రాన్ని లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని మంత్రి నారాయణ అన్నారు. సోమవారం విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐఈసీ
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రాన్ని లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని మంత్రి నారాయణ అన్నారు. సోమవారం విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐఈసీ, కెపాసిటీ బిల్డింగ్‌పై రాష్ట్ర స్థాయి వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం, గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లతో పాటు కొత్తగా కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతిలో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ద్రవ వ్యర్థాల నిర్వహణ కోసం సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు రెండేళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు. అమృత పథకం నిధులతో డ్రింకింగ్ వాటర్ పైప్‌లైన్లు పూర్తి చేస్తామని చెప్పారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్ తదితరులు ప్రసంగించారు.