Swachh Andhra : ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:01 AM
దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛదివస్ కార్యక్రమాన్ని నిర్వహించనునట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ఈ నెల 18న కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని

12 నెలలకు 12 థీమ్‌లతో కార్యక్రమాలు:సీఎస్ విజయానంద్
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛదివస్ కార్యక్రమాన్ని నిర్వహించనునట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ఈ నెల 18న కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవతంగా నిర్వహించేందుకు కలెక్టర్లు తగిన శ్రద్ధ చూపాలన్నారు. నెల కొకటి చొప్పున 12మాసాలకు 12 థీమ్‌లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమాన్ని క్యాంపెయిన్ మోడ్‌లో నిర్వహించాలని మంత్రి నారాయణ సూచించారు. కాగా, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 26న నిర్వహించనున్న 76వ గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో గురువారం ఆయన వర్చువల్‌గా సమీక్షించారు. వివిధ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా కనీసం 14 శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శనకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.