టిడ్కో లబ్ధిదారులను మోసగించిన వైసీపీ ప్రభుత్వం
ABN , Publish Date - Jan 26 , 2025 | 12:30 AM
టిడ్కో లబ్ధిదారులను గత వైసీపీ ప్రభుత్వం మోసంచేసి అప్పుల ఊబిలో నెట్టివేసిందని, ఆ అప్పులకు వడ్డీల చెల్లింపును కూటమి ప్రభుత్వం చర్యలు చేపడు తోందని టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్ అన్నారు.
టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్
నూజివీడు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): టిడ్కో లబ్ధిదారులను గత వైసీపీ ప్రభుత్వం మోసంచేసి అప్పుల ఊబిలో నెట్టివేసిందని, ఆ అప్పులకు వడ్డీల చెల్లింపును కూటమి ప్రభుత్వం చర్యలు చేపడు తోందని టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్ అన్నారు. నూజి వీడు ఎమ్మార్ అప్పారావు కాలనీలోని టిడ్కో భవనాల సముదాయా న్ని ఆయన శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ కారణాలతోనే టిడ్కో భవనాల నిర్మా ణంలో తీవ్ర నిర్లక్ష్యం చూపండంతో టిడ్కో కాంట్రాక్టర్ అయిన ఎల్‌అండ్‌టీ 2019లోనే భవన నిర్మాణాలను పూర్తిగా నిలిపి వేసిందన్నారు. ఇది చాలదన్నట్లు 365, 430 చదరపు గజాల ఇళ్ల లబ్ధిదారుల పేరుతో 3.25 లక్షల రూపాయలను బ్యాంకర్ల నుంచి అప్పుగా తీసుకున్న ప్రభుత్వం ఆ నిధులను ఏం చేసిందో తెలియకుండా వ్యవహరించిందన్నారు. రుణ వాయిదాలకు సంబంధించి రూ.145 కోట్లను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. 300 చదరపు అడుగుల నివేశ్న గృహాలకు సంబంధించి ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు మీకు ఉచితంగా ఇళ్లు ఇస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం అందుకు సంబంధించి రూ.500 కోట్లను చెల్లించకుండా ఆ భారాన్ని కూటమి ప్రభుత్వం పైనే వేసింద న్నారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం తొలుత 365, 430 చదరపు అడుగుల ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందిం చాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామన్నారు. జనసేన నియోజక వర్గ సమన్వయకర్త బర్మాఫణిబాబు, నియోజకవర్గ జనసేన నాయ కులు పాల్గొన్నారు.