Share News

AP TDP MPs: యూరియా కొరతను నివారించండి

ABN , Publish Date - Jul 25 , 2025 | 05:41 AM

ఏపీ రైతులకు అవసరమైన యూరియా నిరంతరాయంగా సరఫరా చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు టీడీపీ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది.

AP TDP MPs: యూరియా కొరతను నివారించండి

  • కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు టీడీపీ ఎంపీల వినతి

న్యూఢిల్లీ, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఏపీ రైతులకు అవసరమైన యూరియా నిరంతరాయంగా సరఫరా చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు టీడీపీ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణప్రసాద్‌తో కలిసి జేపీ నడ్డాను గురువారం కలిశారు. ఏపీలో యూరియా కొరత సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ‘జూలైలో ఏపీకి 80,515 టన్నుల యూరియా కొరత ఉంది. జూలై ఖరీఫ్‌ ప్రణాళిక ప్రకారం, కేంద్ర ఎరువుల శాఖ ఏపీకి 1.30 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. అయితే, జూలై 18 నాటికి రవాణాలో ఉన్న మెటీరియల్‌తో సహా కేవలం 49,485 టన్నులు మాత్రమే చేరింది. దీంతో 80 వేల టన్నులకు పైగా కొరత ఏర్పడింది. క్రిబ్‌కో, సీఐఎల్‌, ఐపీల్‌ కంపెనీ, గంగవరం పోర్టు నుంచి యూరియా కేటాయింపులు పెంచాలి’ అని టీడీపీ ఎంపీలు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 05:42 AM