Share News

EAPCET : మే 19 నుంచి ఈఏపీసెట్‌

ABN , Publish Date - Feb 14 , 2025 | 06:18 AM

2025-26 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్య ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించింది. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ పరీక్షలు మే 19 నుంచి

EAPCET : మే 19 నుంచి ఈఏపీసెట్‌

అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): 2025-26 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్య ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించింది. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ పరీక్షలు మే 19 నుంచి ప్రారంభం కానున్నాయి. 19, 20 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ర్టీమ్‌ పరీక్షలు, 21 నుంచి 27 వరకు ఇంజనీరింగ్‌ స్ర్టీమ్‌ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 10 ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి గురువారం రాత్రి ఆలస్యంగా ప్రకటించింది. ప్రవేశ పరీక్షల బాధ్యతను వివిధ యూనివర్సిటీలకు అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.

ex.jpg

Updated Date - Feb 14 , 2025 | 06:18 AM