AP Government: పట్టణ ప్రజలకు ఊరట
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:06 AM
ఏపీలోని పట్టణ ప్రజలకు మున్సిపల్ శాఖ ఊరటనిచ్చింది. పట్టణాభివృద్ధి అథారిటీలకు భవనాల నిర్మాణాలు,

భవన, లేఅవుట్ల అనుమతుల బాధ్యత మున్సిపాలిటీలకే
అనుమతులు సరళతరం... త్వరలో ఆర్డినెన్స్ జారీ
అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ఏపీలోని పట్టణ ప్రజలకు మున్సిపల్ శాఖ ఊరటనిచ్చింది. పట్టణాభివృద్ధి అథారిటీలకు భవనాల నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులిచ్చే అధికారం తొలగించి మున్సిపాలిటీలకు అప్పగించింది. ఇప్పటి వరకు విశాఖపట్నం, విజయవాడ నగరాపాలక సంస్థల్లో మినహా మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులివ్వడంలో కొన్ని పరిమితులున్నాయి. భారీ భవంతులు, భారీ విస్తీర్ణంలోని లేఅవుట్ల అనుమతుల కోసం దరఖాస్తులను పట్టణ స్థానిక సంస్థల ద్వారా పట్టణాభివృద్ధి సంస్థలకు పంపుతున్నారు. వాటికి అనుమతి లభించడంలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ కొన్ని రాష్ట్రాలను సందర్శించి అధ్యయనం చేశారు. అనుమతుల ప్రక్రియను సరళతరం చేసేందుకు శాఖ శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ గురువారం ఆమోదించింది.