Polavaram project: తెలంగాణవన్నీ అభూతకల్పనలే
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:22 AM
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ చేసిన ఆరోపణలను ఏపీ తిప్పికొట్టింది. ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక దశలో ఉందని, అనుమతులతో మాత్రమే నిర్మాణం చేపడతామని ఏపీ అధికారులు స్పష్టం చేశారు.
బనకచర్ల ఇంకా ఆలోచన దశలోనే ఉంది.. గోదావరి బోర్డు భేటీలో ఏపీ స్పష్టీకరణ
కేంద్రం సూచనతో డీపీఆర్ తయారుచేస్తున్నాం.. అయినా రోజుకు 4 టీఎంసీలు
తరలిస్తున్నామని ఊహాజనితంగా ఫిర్యాదు చేస్తారా?.. ప్రాజెక్టుపై గోప్యత ఉండదు
రోజుకు 2 టీఎంసీల చొప్పునే తీసుకుంటాం.. అది కూడా వంద రోజులే: ఈఎన్‌సీ
అమరావతి/హైదరాబాద్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ చెబుతున్నవ న్నీ అభూతకల్పనలేనని ఏపీ కొట్టివేసింది. ప్రాజెక్టు సమ గ్ర నివేదిక(డీపీఆర్) ఇవ్వాలని కేంద్రం కోరినందున.. ఆ దిశగా కార్యాచరణకు సిద్ధమైనట్లు తెలిపింది. సోమవారం హైదరాబాద్ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్ర ఈఎన్‌సీ-సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ సుగుణాకరరావు, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ అనిల్‌కుమార్ హాజరయ్యారు. బనకచర్ల ద్వారా రోజుకు 4 టీఎంసీల చొప్పున ఏపీ అక్రమంగా గోదావరి జలాలను తరలించుకుపోతోందన్న తెలంగాణ ఆరోపణలపై ఈఎన్‌సీ ఘాటుగానే స్పందించా రు. ఈ ప్రాజెక్టు ఇంకా ఆలోచన దశలోనే ఉందని.. ప్రాథమిక దశలో ఉండగానే రోజుకు 4 టీఎంసీల చొప్పున ఎత్తిపోసేస్తున్నామంటూ పూర్తి అవాస్తవాలు, ఊహాజనితమైన ఫిర్యాదులు చేయడం ఏమిటని నిలదీశారు. ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు అవసరమైనందున.. కేంద్రం సహకారం కోరుతూ లేఖ రాశామని చెప్పారు. తాము తెలంగాణ తరహాలో తొమ్మిది ప్రాజెక్టులను బోర్డుల అనుమతి లేకుండా నిర్మించలేదన్నారు.
దానిపై అప్పుడే ఫిర్యాదు చేయాల్సిందని రాహుల్ బొజ్జా వ్యాఖ్యానించగా.. ఫిర్యాదులు చేయ డం తమకు అలవాటు లేదని.. ఏదైనా పూర్తిస్థాయి అనుమతులు తీసుకునే ప్రాజెక్టులు కడతామని వెంకటేశ్వరరా వు బదులిచ్చారు. పైగా పోలవరం-బనకచర్ల పూర్తిగా త మ అంతర్గత ప్రాజెక్టు అని తేల్చిచెప్పారు. గోదావరిలో 320 టీఎంసీల వరద జలాలను వాడుకుంటామని 2018 లోనే కేంద్రానికి, గోదావరి బోర్డుకు తెలియజేశామని, ఇప్పుడు కూడా 100 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను మాత్రమే పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తామని చెప్పారు. చైర్మన్ ప్రధాన్ సమక్షంలోనే ఈఎన్‌సీ చెప్పడంతో.. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అభిప్రాయాలను బదలాయించుకుందామని రాహుల్ అన్నారు.
సభ్య కార్యదర్శి తీరుపై తీవ్ర అభ్యంతరం
గోదావరి బోర్డు సభ్యకార్యదర్శి అళగేషన్ వ్యవహార శైలిపై తెలుగు రాష్ట్రాల అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆయన భాష, ఉద్యోగిను ల పట్ల అనుచిత వైఖరిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకోవైపు.. గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులను జీఆర్‌ఎంబీకి అప్పగించేందుకు తెలుగు రాష్ట్రాలు నిరాకరించాయి. కాగా.. గోదావరిపై తెలు గు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.92.50 కోట్లు ఖర్చవుతాయని, తాత్కాలిక మరమ్మతులకు రూ.15 కోట్లు అవసరమని తెలంగాణ తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు ప్రకారం నిధులు చెల్లించడానికి ఏపీ సుముఖత వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి..
TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్
Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు
Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా
Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..