Rain Alert: నేడు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:32 AM
వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం గుజరాత్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
విశాఖపట్నం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం గుజరాత్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్ వరకు విస్తరిస్తాయని పేర్కొంది. కాగా.. ఆదివారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగింది. కావలిలో 37.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.