AP Police Welfare Association: ఎస్పీపై రౌడీషీట్ తెరుస్తారా
ABN , Publish Date - Jul 28 , 2025 | 04:35 AM
పోలీసు శాఖ ఇచ్చిన ఉత్తర్వులను పాటించకుండా.. తమ ప్రభుత్వం వస్తే చిత్తూరు ఎస్పీపైనే రౌడీషీట్ తెరుస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అనడం దారుణమని ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసు సంక్షేమ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
అంబటి వ్యాఖ్యలు దారుణం
ఇది పోలీసులను బెదిరించడమే
పోలీసు సంక్షేమ సంఘం ఆగ్రహం
రిమాండ్‌లో ఉన్న మిథున్‌రెడ్డికి పెద్దిరెడ్డి పీఎ్‌సవో సపర్యలు నేరమే
పూర్తి స్థాయి విచారణ తర్వాతే సస్పెన్షన్
చిత్తూరు అర్బన్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖ ఇచ్చిన ఉత్తర్వులను పాటించకుండా.. తమ ప్రభుత్వం వస్తే చిత్తూరు ఎస్పీపైనే రౌడీషీట్ తెరుస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అనడం దారుణమని ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసు సంక్షేమ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది పోలీసులను బెదిరించడమేనన్నారు. ఆదివారం చిత్తూరులో సంఘం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, కోశాధికారి ఎం.పరంధామనాయుడు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఖాదర్‌బాషా, ఈసీ సభ్యుడు శరవణ తదితరులు విలేకరులతో మాట్లాడారు. ‘పోలీసు యంత్రాంగం చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తోంది. తప్పుడు ప్రకటనలతో పోలీసు వ్యవస్థ మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం మానుకోవాలి. బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్ పర్యటనకు 500 మందికి అనుమతిస్తే వేల మంది వైసీపీ కార్యకర్తలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోనే పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రభుత్వం కేటాయించిన పీఎ్‌సవో ఆయన భద్రతను గాలికొదిలి.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డికి అవసరమైన వస్తువులను తీసుకెళ్లడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఎస్పీ సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపాకే ఈ నిర్ణయం తీసుకున్నారు. నిందితుడికి మానవతా దృక్పథంతో పీఎ్‌సవో దిండు, భోజనం తీసుకెళ్లారని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో
బద్వేల్‌లో ఉప ఎన్నిక.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News