AP Police: పోలీసు పరీక్షా ఫలితాలు విడుదల
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:29 AM
ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల తుది పలితాలు గురువారం రాత్రి విడుదలయ్యాయి. ఫైనల్ పరీక్షను 37,600మంది రాయగా 33,921 మంది అర్హత సాధించారని ఎస్‌ఎల్ పీఆర్‌బీ చైర్మన్ ఆర్‌కే మీనా....
త్వరలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల తుది పలితాలు గురువారం రాత్రి విడుదలయ్యాయి. ఫైనల్ పరీక్షను 37,600మంది రాయగా 33,921 మంది అర్హత సాధించారని ఎస్‌ఎల్ పీఆర్‌బీ చైర్మన్ ఆర్‌కే మీనా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వీరిలో 4,710 మంది మహిళా అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లు ఈ నెల 12 సాయంత్రం ఐదింటి వరకూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సందేహాలుంటే రూ.వెయ్యి చెల్లించి రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించవచ్చు. మొత్తం 6100 పోస్టుల భర్తీకి పోలీసు శాఖ 2022 నవంబరు చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయగా, ఎట్టకేలకు భర్తీ ప్రకియ కొలిక్కి వచ్చింది. తుది ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులకు త్వరలోనే పోస్టింగ్‌లు ఇచ్చి, శిక్షణకు పంపనున్నారు.