AP PGECET: ఏపీ పీజీఈసెట్ 2025 ఫలితాలు విడుదల
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:00 AM
రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్, ఎం.ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసెట్-2025 ఫలితాలను ఉన్నత విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేశారు.
విశాఖపట్నం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్, ఎం.ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసెట్-2025 ఫలితాలను ఉన్నత విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఈ నెల ఆరు నుంచి ఎనిమిదో తేదీ మధ్య రాష్ట్రవ్యాప్తంగా 18 నగరాల్లోని 27 కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లోని ఒక కేంద్రంలో నిర్వహించిన పరీక్షకు 12,019 మంది హాజరయ్యారు. వీరిలో 11,244 మంది (93.55 శాతం) అర్హత సాధించారు. ఏయూ పరిధిలో 8,179 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 7,651 మంది (93.54 శాతం) అర్హత సాధించారు. అలాగే, ఎస్వీయూ పరిధిలో 3,434 మంది పరీక్షకు హాజరు కాగా, 3,208 మంది (93.42 శాతం) అర్హత సాధించారు.