Share News

AP News: మద్యం షాపు నిర్వహకులకు బెదిరింపు.. డబ్బుల కోసం హోంగార్డు నాటకం..

ABN , Publish Date - Jan 30 , 2025 | 09:47 PM

విజయవాడలో జీఆర్పిఎఫ్‌ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న సుమన్ బండారం బయటపడడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌ల ఫోన్ నంబర్లు సేకరించి వారి ద్వారా మద్యం షాపు నిర్వాహకులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నాడు.

AP News: మద్యం షాపు నిర్వహకులకు బెదిరింపు.. డబ్బుల కోసం హోంగార్డు నాటకం..
police

చెడు వ్యసనాలకు బానిసైన ఓ హోంగార్డు మద్యం షాపు యజమానలను బెదిరించి డబ్బుబుల సంపాదించే పనిలో పడ్డాడు. విజయవాడలో జీఆర్పిఎఫ్‌ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న సుమన్ బండారం బయటపడడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌ల ఫోన్ నంబర్లు సేకరించి వారి ద్వారా మద్యం షాపు నిర్వాహకులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నాడు.


మచిలీపట్నంకు సమీపంలోని తాళ్లపాలెంలో వసుధ వైన్స్ నిర్వాహకులకు ఫోన్ చేసిను హోంగార్డు సుమన్ ఆరు వేల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో ఆ వైన్ షాప్ నిర్వాహకులు ఆ డబ్బులను సుమన్‌కు ఫోన్ పే చేశారు. రెండో సారి కూడా మరో ఆరు వేలు కావాలంటూ వసుధ వైన్స్ నిర్వాహకులకు సుమన్ ఫోన్ చేశాడు. సుమన్ వ్యవహరంపై అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డబ్బులు తీసుకునేందుకు స్వయంగా రావాలని చెప్పడంతో సుమన్ అక్కడకు వెళ్లాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. హోంగార్డు సుమన్ పై బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Updated Date - Jan 30 , 2025 | 09:47 PM