AP Steel Investment: పెట్టుబడులకు ఏపీలో అపార అవకాశాలు
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:46 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఇండియా స్టీల్స్-2025 సదస్సులో దేశ విదేశాల ఉక్కు కంపెనీల ప్రతినిధులకు ఈ విషయాన్ని వివరించారు.
ఉక్కు రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు. భారత ఉక్కు మంత్రిత్వశాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో ‘ఇండియా స్టీల్స్-2025’ పేరుతో ముంబైలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్-సదస్సుకు ఏపీ నుంచి మంత్రి భరత్, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ హాజరయ్యారు. దేశ, విదేశాల నుంచి ఈ సదస్సుకు వచ్చిన పెద్దపెద్ద స్టీల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి భరత్ ముఖాముఖిగా మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి వారికి వివరించారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..