Share News

Liquor Scam: మహా మద్య మాయలు అంతులేని ‘కిక్కు’ లెక్క!

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:38 AM

ఇప్పటిదాకా అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి! ఎన్నెన్నో స్కామ్‌లు బయటపడ్డాయి. కానీ... స్కామ్‌లకు మించిన స్కామ్‌, ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ స్కామ్స్‌’ జగన్‌ హయాంలోనే జరిగింది. అది... మద్యం కుంభకోణం! ! ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఒక ‘క్వార్టర్‌ బాటిల్‌’ లాంటిదైతే, ఏపీలో వైసీపీ పెద్దలు చేసిన మద్యం కుంభకోణం ఒక ‘లిక్కర్‌ మాల్‌’ అంత పెద్దది! వైసీపీ పెద్దలు నడిపించిన స్కామ్‌లో అనేక పాత్రలు, పాత్రధారులు! ‘సిట్‌’ విచారణలో భాగంగా అందులో కొందరు నోరు తెరుస్తున్నారు. మద్యం షాపుల్లో ఆర్డర్లు పెట్టినట్లు చెబుతున్న కంప్యూటర్ల నుంచి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో సీజ్‌ చేసిన కంప్యూటర్లు, హార్డ్‌డి్‌స్కల వరకూ అన్నింటినీ ల్యాబ్‌కు పంపి నివేదిక తెప్పించుకున్న ‘సిట్‌’ అనేక సంచలన అంశాలను గుర్తించింది.

 Liquor Scam: మహా మద్య మాయలు అంతులేని ‘కిక్కు’ లెక్క!

‘ఢిల్లీ’ని తలదన్నేలా ఏపీ మద్యం కుంభకోణం

జగన్‌ సర్కారులో అడ్డగోలుగా దందా

‘సిట్‌’ దర్యాప్తులో సంచలన విషయాలు

ప్రభుత్వ ఖజానాకు 18 వేలకోట్ల నష్టం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇప్పటిదాకా అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి! ఎన్నెన్నో స్కామ్‌లు బయటపడ్డాయి. కానీ... స్కామ్‌లకు మించిన స్కామ్‌, ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ స్కామ్స్‌’ జగన్‌ హయాంలోనే జరిగింది. అది... మద్యం కుంభకోణం! ! ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఒక ‘క్వార్టర్‌ బాటిల్‌’ లాంటిదైతే, ఏపీలో వైసీపీ పెద్దలు చేసిన మద్యం కుంభకోణం ఒక ‘లిక్కర్‌ మాల్‌’ అంత పెద్దది! వైసీపీ పెద్దలు నడిపించిన స్కామ్‌లో అనేక పాత్రలు, పాత్రధారులు! ‘సిట్‌’ విచారణలో భాగంగా అందులో కొందరు నోరు తెరుస్తున్నారు. మద్యం షాపుల్లో ఆర్డర్లు పెట్టినట్లు చెబుతున్న కంప్యూటర్ల నుంచి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో సీజ్‌ చేసిన కంప్యూటర్లు, హార్డ్‌డి్‌స్కల వరకూ అన్నింటినీ ల్యాబ్‌కు పంపి నివేదిక తెప్పించుకున్న ‘సిట్‌’ అనేక సంచలన అంశాలను గుర్తించింది. మరీ ముఖ్యంగా... ఈ స్కామ్‌లో కీలకమైన ‘స్ర్కిప్ట్‌’ కూడా దొరికిపోయింది. మద్యం కుంభకోణంలో వైసీపీ పెద్దలు, రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో కీలక స్థానంలో ఉన్న అధికారులతో మొదలుకుని డేటా ఎంట్రీ ఆపరేటర్‌ వరకు తమ తమ పాత్రలు పోషించారు. వీరిలో ఐదుగురు విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలాలు కీలకంగా మారాయి. వారే... ఏపీ బేవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన డిప్యూటీ కమిషనర్‌ సత్యప్రసాద్‌, ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉద్యోగి, రైల్వే నుంచి వైసీపీ హయాంలో వచ్చి ఎన్నికల తర్వాత తిరిగి వెళ్లిన రమేశ్‌కుమార్‌ రెడ్డి, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ అనూష! వీరిలో సత్యప్రసాద్‌ న్యాయమూర్తి ఎదుట సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. స్కామ్‌ జరిగిన తీరును పూసగుచ్చినట్లు వివరించారని సమాచారం. మద్యం కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు దాదాపు 18 వేలకోట్ల నష్టం జరిగినట్టు దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది.


ఇదీ... స్కామ్‌ రూటు!

జగన్‌ వచ్చీ రాగానే మద్యం పాలసీ మార్చేశారు. ప్రైవేటు దుకాణాల స్థానంలో ‘ప్రభుత్వ’ దుకాణాలు తెరిచారు. మొత్తం స్కామ్‌కు అదే మూలం. సాధారణంగా... షాప్‌ సూపర్‌వైజర్‌ తమకు కావాల్సిన సరుకు ఏది, ఎంత అన్నది ఆన్‌లైన్‌లో డిపో మేనేజర్‌ను అడగాలి! కానీ... ఇక్కడ సూపర్‌వైజర్‌ పాత్రను ‘సేల్స్‌’కు మాత్రమే పరిమితం చేశారు. ‘ఇండెంట్‌ పెట్టడం’ అనే దశను పూర్తిగా ఎత్తేశారు. తమ సొంత బ్రాండ్లు, తమకు కమీషన్‌ ఇచ్చేందుకు అంగీకరించిన బ్రాండ్లను మాత్రమే దుకాణాలకు పంపించేవారు. ఇలా... సొంత బ్రాండ్లను మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ బ్రాండ్‌ మద్యం ఎంత అమ్ముడయిందనే వివరాలు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ అనూష ద్వారా రాజ్‌ కసిరెడ్డి కార్యాలయానికి చేరేవి. ఆ విక్రయాల ఆధారంగా... ఎవరి నుంచి ఎంత కమీషన్‌ వసూలు చేయాలో లెక్కలు సిద్ధం చేసేవాళ్లు. ప్రభుత్వం నుంచి సదరు కంపెనీకి పేమెంట్‌ జరగ్గానే... కంపెనీలు కమీషన్‌ను చెల్లించేవి.


ఐటీ సలహాదారు.. మద్యం కలెక్షన్లు!

జగన్‌ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అలియాస్‌ రాజ్‌ కసిరెడ్డిని పెట్టుకున్నారు. రాజ్‌ కసిరెడ్డి సలహాలతో రాష్ట్ర ఐటీ రంగం ఏ మేరకు అభివృద్ధి చెందిందో కానీ మద్యం కమీషన్ల వసూళ్లలో మాత్రం ఆయన పాత్ర కీలకం. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి అని కుండబద్దలు కొట్టారు. దీంతో సిట్‌ అధికారులకు ఓ స్పష్టత వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మద్యం డిస్టిలరీస్‌ నుంచి ఆర్గనైజర్లు వసూలు చేసిన మొత్తాన్ని రాజ్‌ కసిరెడ్డి ద్వారా పార్టీలో కీలకనేతకు, అక్కడి నుంచి బిగ్‌బా్‌సకు చేరేదని చైన్‌ లింక్‌లో కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది.

ఐఏఎ్‌సకూ వాటా

మద్యం కుంభకోణంలో ఎవరి వాటా ఎంత అన్నది ఇటీవల సిట్‌ అధికారుల విచారణలో వాసుదేవ రెడ్డి, సత్యప్రసాద్‌ వెల్లడించినట్లు తెలిసింది. వారిద్దరూ ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించుకున్న అధికారులు మరింత లోతుగా కూపీ లాగగా ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి భారీగా లబ్ధి పొందినట్లు అంచనాకు వచ్చారు. మద్యం బాటిళ్లు విక్రయించిన తర్వాత మిగిలే ఖాళీ అట్టపెట్టెల ద్వారా వచ్చిన సొమ్ములో కూడా ఆయన వాటా అడిగేవారని సమాచారం. ‘సీఐడీలో 1.19 కోట్లు దుర్వినియోగం చేశారని ఒక ఐపీఎ్‌సపై కేసు నమోదైంది. మద్యం కుంభకోణంలో సీనియర్‌ ఐఏఎస్‌ ఇంతకు వంద రెట్లు ఎక్కువగా తీసుకుని రిటైరయి వెళ్లిపోయారు’ అంటూ ఉన్నతస్థాయి పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.


ఇవి కూడా చదవండి..

Slap Fight: చెంపలు పగిలేగా కొట్టుకున్న బీజేపీ నేత, పోలీస్ ఆఫీసర్.. వీడియో వైరల్

DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 03:38 AM