Radiation belts : మూగజీవాలకు రేడియం బెల్ట్‌తో ప్రమాదాల నివారణ
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:49 AM
రాత్రి వేళ్లలో మూగజీవాలు అకస్మాత్తుగా రోడ్ల మీదకు రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల నివారణకు ఆవులు, గేదెలకు రేడియం బెల్ట్‌లు ధరింపజేయాలని ఏపీ

న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి బబిత
అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాత్రి వేళ్లలో మూగజీవాలు అకస్మాత్తుగా రోడ్ల మీదకు రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల నివారణకు ఆవులు, గేదెలకు రేడియం బెల్ట్‌లు ధరింపజేయాలని ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత తెలిపారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సూచన మేరకు ఆవులు, గేదెలకు రేడియం బెల్ట్‌లు ధరింపజేసే కార్యక్రమాన్ని రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ ఉపకార్యదర్శి అమర రంగేశ్వరరావు, తుళ్లూరు డీఎస్పీ మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు.