AP Textile Boom 2 Lakh Jobs and Big Perks: టెక్స్‌టైల్స్‌లో నవశకం
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:02 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్స్‌టైల్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ కొత్త పాలసీని ప్రకటించింది. రూ.10 వేల కోట్ల పెట్టుబడి, 2 లక్షల మందికి ఉపాధిని లక్ష్యంగా పెట్టుకుని వివిధ రాయితీలు, ప్రోత్సాహకాలను అందించనుంది

10 వేల కోట్ల పెట్టుబడి.. 2 లక్షల మందికి ఉపాధే లక్ష్యం
పెట్టుబడిదారులందరికీ రాయితీలు, ప్రోత్సాహకాలు
నూతన టెక్స్‌టైల్ పాలసీ విడుదల చేసిన ప్రభుత్వం
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో 2లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం టెక్స్‌టైల్ పాలసీ ప్రకటించింది. ఈ రంగంలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. చిన్న, పెద్ద పెట్టుబడిదారులకు రాయితీలపై విధివిధానాలు విడుదల చేసింది. నేత, ప్రాసెసింగ్, వస్త్రాలతో పాటు ఇంటిగ్రేటెడ్ యూనిట్లపై ప్రోత్సాహకాలు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళలకు మూలధన రాయితీలు, అదనపు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు స్పష్టం చేసింది. అట్టడుగు వర్గాల మహిళలకు విస్తృత ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ వస్త్ర పరిశ్రమలో పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానం చేసేలా ఐదేళ్లపాటు (2024-29) అమలయ్యే నూతన పాలసీ రూపొందించింది.
రాయితీపై విద్యుత్..
ఈ పాలసీలో భాగంగా వస్త్రపరిశ్రమలకు రాయితీలపై ప్రభుత్వం విద్యుత్తు ఇస్తుంది. పరిశ్రమ స్థాపనకు కేటాయించిన భూమి అభివృద్ధి ఫీజులో 50శాతం ఇస్తూనే ల్యాండ్ కన్వర్షన్ రుసుము పూర్తిగా రీయింబర్స్ చేస్తుంది. విద్యుత్తు, నీరు, రోడ్ల అభివృద్ధికి అయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ.కోటికి దాటకుండా 50శాతం రాయితీ ఇస్తుంది. ఐదేళ్ల టర్మ్‌లోన్‌పై ఏడాదికి 8శాతం చొప్పున వడ్డీరాయితీ, వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ల పాటు విద్యుత్‌కు యూనిట్‌పై రూపాయి, సుంకం ఛార్జీలో 50శాతం రాయితీ లభిస్తుంది. టెక్స్‌టైల్ యూనిట్లకు ఇచ్చే భూమి స్టాంప్, ట్రాన్స్‌ఫార్మ్ డ్యూటీతో పాటు స్టాంప్ డ్యూటీలో వంద శాతం రీయింబర్స్ ఉంటుంది. రాష్ట్రంలో తయారు చేసిన తుది ఉత్పత్తుల విక్రయాలపై ఎంఎ్‌సఎంఈలు భారీ యూనిట్లకు చెల్లించాల్సిన ఎస్‌జీఎస్టీని వాణిజ్య ఉత్పత్తి తేదీ నుంచి ఐదేళ్లలో తిరిగి ప్రభుత్వం చెల్లిస్తుంది. నీటి ఆడిట్ ఖర్చులో 75 శాతం, ఎనర్జీ ఆడిట్ ఖర్చులో వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద రూలక్ష నుంచి 2లక్షలు అందిస్తుంది. వస్త్రం పేటెంట్ పొందేందుకయ్యే ఖర్చులో 50 శాతం(10 లక్షల వరకూ) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారీ, మెగా, అలా్ట్ర మెగా ప్రాజెక్టులకు ఐదేళ్ల పాటు నెలవారీ ఉపాధి రాయితీ ఉంటుంది. ఈ రాయితీ ఈఎ్‌సఐ, ఈపీఎ్‌ఫకు చెల్లించే మొత్తంలో 75శాతం రీయింబర్స్ లభిస్తుంది. ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్‌పైనా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు మూడు రకాలుగా ఉంటాయి. భారీ ప్రాజెక్టులకు 20ు లేదా రూ.15కోట్లు, మెగా ప్రాజెక్టులకు 20ు లేదా రూ.30కోట్లు, అలా్ట్ర మెగా ప్రాజెక్టులకు 20ు లేదా రూ.50కోట్లు ఇస్తారు. బీసీ మహిళలు, ఎస్‌సీ, ఎస్టీ, దివ్యాంగులకు అదనంగా 10 శాతం ఎఫ్‌సీఐ, బీసీలకు 5శాతం, ప్రత్యేక సామర్థ్యం ఉన్న పారిశ్రామిక వేత్తలకు 10 శాతం లభిస్తుందని కొత్త పాలసీలో ప్రభుత్వం వివరించింది.