AP Intermediate Exams: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Mar 01 , 2025 | 05:43 AM
తొలిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాయనున్న
10.58 లక్షల మంది విద్యార్థులు
అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్షా కేంద్రాలను ‘నో మొబైల్ జోన్’గా ప్రకటించారు. అయితే అధికారిక సమాచారం కోసం చీఫ్ సూపరింటెండెంట్‌కు మాత్రమే ఇంటర్ బోర్డు ఒక కీప్యాడ్ ఫోన్‌ను సమకూర్చారు. ఈ పరీక్షలకు నిమిషం నిబంధనను అమలు చేస్తున్నారు. అంటే.. పరీక్షలకు హాజరయ్యేవారు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: భవిష్యత్తులో ఏపీలో రాబోయే మార్పులు చెప్పిన పవన్
Vamsi Petition: బ్యారక్ మార్చండి.. లేదా ఖైదీలను పంపండి.. వంశీ పిటిషన్
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..