Share News

Andhra University: ఏపీ ఐసెట్‌లో 50 శాతం ఉత్తీర్ణత

ABN , Publish Date - May 21 , 2025 | 04:00 AM

ఏపీ ఐసెట్‌-2025 ఫలితాలు విడుదలయ్యాయి; మొత్తం 95.86 శాతం మంది అర్హత సాధించారు. ఏయూ, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు.

 Andhra University: ఏపీ ఐసెట్‌లో 50 శాతం ఉత్తీర్ణత

విశాఖపట్నం, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సు ల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2025 ఫలితాలను చైర్మన్‌, ఆంధ్రాయూనివర్సిటీ(ఏయూ) వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ మంగళవారం విడుదల చేశారు. ఐసెట్‌కు 34,131 మంది హాజరుకాగా, 32,719 మంది(95.86ు) అర్హత సాధించినట్టు వెల్లడించారు. ఏయూ పరిధిలో 20,480 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 19,793 మంది(96.6ు), శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 12,804 మంది పరీక్షకు హాజరుకాగా...12,096 మంది(94.4ు) అర్హత సాఽధించినట్టు తెలిపారు. నాన్‌ లోకల్‌ కేటగిరీలో 847 మంది పరీక్షకు హాజరుకాగా, 830 మంది (97ు) అర్హత సాధించారన్నారు.

టాప్‌ ర్యాంకులు వీరికే!

విశాఖకు చెందిన మనోజ్‌ మేకా 197.91 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. కడప జిల్లాకు చెందిన ద్వారకచర్ల సందీ్‌పరెడ్డి 179.51 మార్కులతో రెండో ర్యాంకు, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఎస్‌.కృష్ణసాయి 178.51 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 04:00 AM