Share News

Minister Anitha : గంజాయి సాగు 90 శాతం తగ్గింది

ABN , Publish Date - Mar 07 , 2025 | 07:18 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఉత్తరాంధ్ర జిల్లాల్లో 70 వేల కిలోల గంజాయిని ధ్వంసం చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు.

Minister Anitha : గంజాయి సాగు 90 శాతం తగ్గింది

సాగు చేస్తే ఆస్తులు జప్తే: మంత్రి అనిత

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఉత్తరాంధ్ర జిల్లాల్లో 70 వేల కిలోల గంజాయిని ధ్వంసం చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. గంజాయి ఉత్పత్తి, తయారీ, నిల్వ, రవాణా, ఎగుమతి, దిగుమతి, వాడకం, ప్రేరేపించినా అన్నీ నేరాలేనని, ఎవరు చేసినా శిక్ష తప్పదని చెప్పారు. గురువారం శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గంజాయి కేసులు పెరిగాయన్న వైసీపీ విమర్శలపై మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తొలి కొకైన్‌ కేసు ఘనతా వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గతంలో కంటే 90 శాతం గంజాయి సాగు తగ్గిందన్నారు. గంజాయి సాగు చేసే వారి ఆస్తులను జప్తు చేసే కార్యక్రమం ప్రారంభించామన్నారు. 3 చోట్ల ఆస్తులను జప్తు చేశామన్నారు. ప్రస్తుతం ఒడిసా నుంచి గంజాయి రవాణా అధికంగా సాగుతోందని, దీన్ని ఆపేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. హోంమంత్రిపై గతంలో డిప్యూటీ సీఎం పవన్‌ చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ ప్రస్తావించగా.. మంత్రి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సందర్భంలో మాట్లాడారో తెలుసుకోవాలన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 07:18 AM