Share News

AP High Court: సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా.. లేదా

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:28 AM

సంకరజాతి అంటూ రాజధాని ప్రాంత ప్రజలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేస్తున్నారో, లేదో చెప్పాలని ప్రాసిక్యూషన్‌ను హైకోర్టు ఆదేశించింది.

AP High Court: సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా.. లేదా

  • ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నించిన హైకోర్టు

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): సంకరజాతి అంటూ రాజధాని ప్రాంత ప్రజలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేస్తున్నారో, లేదో చెప్పాలని ప్రాసిక్యూషన్‌ను హైకోర్టు ఆదేశించింది. సజ్జల దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వారంరోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. గురువారం విచారణలో సజ్జల తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అరెస్ట్‌ చేస్తారనే ఆందోళన ఉన్నప్పుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని అన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. ఈ ఫిర్యాదు ఆధారంగా ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని, అందువల్ల ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడానికి అవకాశం లేదని చెప్పారు. కేసు నమోదు చేయాలా వద్దా అనేది దర్యాప్తు అధికారి విచక్షణాధికారమని తెలిపారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. డిప్యూటీ స్పీకర్‌ ఫిర్యాదు ఆధారంగా పిటిషనర్‌పై కేసు పెడుతున్నారో లేదో వివరాలు తమ ముందుంచాలని ఆదేశించారు. సజ్జలపై తొందరపాటు చర్యలు వద్దని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:29 AM