High Court: వైసీపీ నేత ప్రతా్‌పరెడ్డికి భద్రత కల్పించండి
ABN , Publish Date - May 14 , 2025 | 04:57 AM
వైసీపీ నేత ఇందూరి ప్రతాపరెడ్డికి ఎనిమిదివారాల పాటు వన్‌ప్లస్ వన్ భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. భద్రతా ఖర్చు ఆయనే భరించాలని చెప్పి, తదుపరి విచారణను జూలై 1కు వాయిదా వేసింది.
పోలీసులకు హైకోర్టు ఆదేశం
ఆ ఖర్చును ప్రతా్‌పరెడ్డి భరించాలని స్పష్టీకరణ
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత ఇందూరి ప్రతా్‌పరెడ్డికి ఎనిమిది వారాలపాటు వన్ ప్లస్ వన్ భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అందుకు అయ్యే ఖర్చును భరించాలని ప్రతా్‌పరెడ్డికి స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. తన భర్తకు ప్రాణహాని ఉందని, భద్రతను పునరుద్ధరించేలా నంద్యాల ఎస్పీ, ఆళ్లగడ్డ డీఎస్పీ, శిరివెళ్ల ఎస్‌హెచ్‌వోను ఆదేశించాలని కోరుతూ ప్రతా్‌పరెడ్డి సతీమణి మహేశ్వరి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..