AP High Court judges: శ్రీబగళాముఖి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తులు
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:15 AM
చందోలు గ్రామంలోని శ్రీబగళాముఖి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తులు దర్శనం చేశారు. అమ్మవారికి పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు స్వీకరించారు

పిట్టలవానిపాలెం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : బాపట్ల మండలం చందోలు గ్రామంలోని శ్రీబగళాముఖి అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టున్యాయమూర్తులు జస్టిస్ ఎ.హరిహరనాధశర్మ, జస్టిస్ వై.లక్ష్మణరావు దర్శించి అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు న్యాయమూర్తులకు వేద ఆశీర్వచనాలు అందజేయగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.నరసింహమూర్తి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.