Share News

AP Water Resources: రాష్ట్రంలో జల వనరుల శాఖ శిక్షణా సంస్థ

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:24 AM

కేంద్రం నుంచి జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు (అడ్వాన్స్‌) కింద రూ.500 కోట్ల నిధులు వచ్చే వరకూ ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా విజయవాడలో తాత్కాలికంగా జల వనరుల శాఖ కార్యాలయాల సముదాయంలో

AP Water Resources: రాష్ట్రంలో జల వనరుల శాఖ శిక్షణా సంస్థ

తాత్కాలికంగా ఆ శాఖ సముదాయంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జల వనరుల శాఖ శిక్షణా సంస్థ (డబ్ల్యూఆర్‌టీఐ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు (అడ్వాన్స్‌) కింద రూ.500 కోట్ల నిధులు వచ్చే వరకూ ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా విజయవాడలో తాత్కాలికంగా జల వనరుల శాఖ కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాష్ట్ర విభజన జరిగాక ఏపీలో జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ సిబ్బందికి అధ్యయన వేదిక లేకుండా పోయింది. అలాగే కొత్తగా ఇంజనీరింగ్‌ అధికారులుగా చేరేవారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఇన్‌స్టిట్యూట్‌ లేకుండా పోయింది. గత టీడీపీ ప్రభుత్వంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ సమీపంలో బోట్‌ యార్డులో శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ బోట్‌ యార్డు భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించారు. అప్పటి ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఇందుకు వ్యతిరేకించినా రెవెన్యూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక శిక్షణా సంస్థను ప్రాజెక్టు కన్సల్టేషన్‌ సంస్థగా కూడా సద్వినియోగం చేసుకోవాలనే యోచనలో రాష్ట్ర జల వనరుల శాఖ ఉంది.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 04:24 AM