Share News

BC Janardhan Reddy: ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Jun 19 , 2025 | 06:43 AM

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి బీసీ జనార్దనరెడ్డి చెప్పారు.

BC Janardhan Reddy: ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ

  • మంత్రి బీసీ జనార్దనరెడ్డి వెల్లడి.. మౌలిక వసతుల కల్పనపై సమీక్ష

అమరావతి, జూన్‌18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి బీసీ జనార్దనరెడ్డి చెప్పారు. అమరావతి సహా పలు ఎయిర్‌పోర్టుల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. సాగరమాల కింద చేపడుతున్న పనుల పర్యవేక్షణ కోసం వచ్చేనెల 4న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధికారులతో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. బుధవారం విజయవాడలో మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహించారు.


రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు 20కి తగ్గకుండా, ఎయిర్‌పోర్టులు 14కు తగ్గకుండా నిర్మించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్టుల టెక్నికల్‌ ఎకనామికల్‌ ఫీజబిలిటీ రిపోర్టు తయారీకి కన్సల్టెంట్ల నియామకం కోసం టెండర్లను పిలుస్తున్నామని చెప్పారు. ఫైబర్‌నెట్‌ కార్యకలాపాల కోసం రూ.70.82 కోట్లు విదుదల చేశామని, ఈ నిధులతో 29 సంస్థలకు బకాయిలను చెల్లిస్తామని చెప్పారు.

Updated Date - Jun 19 , 2025 | 06:43 AM