Jal Jeevan Mission: తాగునీటికి 13.539 టీఎంసీలు
ABN , Publish Date - May 14 , 2025 | 05:04 AM
జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ తాగునీటి అవసరాలకు 13.538 టీఎంసీల ముడినీటి సరఫరాకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నీటిని యేలేరు, ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ తదితర వనరుల నుంచి వినియోగించనున్నారు.
జల్‌జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు వివిధ జల వనరుల నుంచి 13.538 టీఎంసీల ముడినీటిని సరఫరా చేసేందుకు జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ పాలనామోదం తెలుపుతూ మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. యేలేరు రిజర్వాయరు నుంచి 2.003టీఎంసీలు, ధవళేశ్వరం నుంచి 4.062, ప్రకాశం బ్యారేజీ నుంచి 4.489, వెలగలేరు రిజర్వాయరు నుంచి 0.327, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నుంచి 1.475, వెలిగల్లు నుంచి 0.3, అవుకు రిజర్వాయరు నుంచి 0.299, పులికమ్మ నుంచి 0.583 టీఎంసీల ముడి జలాలను తాగునీటి అవసరాల కోసం కేటాయిస్తున్నట్లుగా సాయిప్రసాద్ ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..