Share News

AP Government: 18 నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:07 AM

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడలను పకడ్బందీగా నిర్వహించేందుకు..

AP Government: 18 నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

పకడ్బందీగా ఏర్పాట్లు.. పరిశీలించిన శాప్‌ చైర్మన్‌

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడలను పకడ్బందీగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలతో ఏర్పాట్లు చేస్తున్నామని శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు తెలిపారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం, ఇండోర్‌ స్టేడియాల్లో జరిగే క్రీడలకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను శాప్‌, వీఎంసీ అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే క్రికెట్‌, వాలీబాల్‌, టెన్ని కాయిట్‌, త్రోబాల్‌, టెన్నిస్‌, కబడ్డీ, థగ్‌ఆ్‌ఫవార్‌, అథ్లెటిక్స్‌ 100 మీటర్ల కోర్టులను పరిశీలించారు. ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించే షటిల్‌ బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌ కోర్టులను తనిఖీ చేశారు.క్రీడల నిర్వహణపై అసెం బ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారని, ఆయన అధికారులకు తెలియజేశారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చక్కని ఏర్పాట్లతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. శాప్‌, వీఎంసీ అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లను పూర్తి చేయాలని రవినాయుడు వారికి పలు సూచనలు చేశారు.

Updated Date - Mar 16 , 2025 | 05:07 AM