AP Minister Nadendla Manohar: 6 కోట్ల గోతాలు సిద్ధం మంత్రి నాదెండ్ల
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:42 AM
ధాన్యం కొనుగోలులో గతఅనుభవాలను పరిగణనలోకి తీసుకున్నాం. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆరు కోట్ల గోనె సంచులు సిద్ధంగా ఉంచాం.
ధాన్యం కొనుగోలులో గతఅనుభవాలను పరిగణనలోకి తీసుకున్నాం. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆరు కోట్ల గోనె సంచులు సిద్ధంగా ఉంచాం. వర్షాలు కురిస్తే ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు 50 వేల టార్పాలిన్లు అందుబాటులో ఉంచాం. వాటిని అవసరమైనప్పుడు రైతులకు ఉచితంగానే అందజేస్తాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ధాన్యంలో తేమ శాతాన్ని నిర్ణయించే విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఒకే కంపెనీకి చెందిన మిషన్లు వాడాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ప్రజా పంపిణీ అవసరాల కోసం ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి రూ.12,200కోట్ల విలువైన 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాం. నవంబరులో 11 లక్షలు, డిసెంబరులో 25 లక్షలు, జనవరిలో 8 లక్షలు, ఫిబ్రవరిలో 3 లక్షలు, మార్చిలో 4 లక్షల టన్నుల చొప్పున ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ సిద్ధం చేశాం’ అన్నారు.