Share News

APSRTC: పూర్తి స్థాయిలో ఆర్టీసీ బోర్డు

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:42 AM

తాజాగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మొత్తం 11 మంది అధికారులకు పాలకమండలిలో చోటు కల్పిస్తూ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండేళ్లపాటు ఈ బోర్డు ఆర్టీసీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.

APSRTC: పూర్తి స్థాయిలో ఆర్టీసీ బోర్డు

అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఏపీఎ్‌సఆర్టీసీకి పూర్తిస్థాయి బోర్డు ఏర్పాటు చేసింది. చైర్మన్‌ కొనకళ్ల నారాయణ, వైస్‌ చైర్మన్‌ మునిరత్నంతో పాటు ఆరుగురు నామినేటెడ్‌ సభ్యుల్ని మూడు నెలల క్రితమే నియమించింది. తాజాగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మొత్తం 11 మంది అధికారులకు పాలకమండలిలో చోటు కల్పిస్తూ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండేళ్లపాటు ఈ బోర్డు ఆర్టీసీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. బోర్డులో తమకూ అవకాశం కల్పించాలంటూ పీటీడీ ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ఏడాది సెప్టెంబరు చివరి వారంలో మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను ఆర్టీసీ చైర్మన్‌గా, కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు మునిరత్నంను వైస్‌ చైౖర్మన్‌గా నియమించింది. డైరెక్టర్లుగా అరకు టీడీపీ నాయకుడు దొన్ను దొర(విజయనగరం), జనసేన నాయకుడు రెడ్డి అప్పలనాయుడు(విజయవాడ), బీజేపీ నాయకుడు సురేశ్‌ రెడ్డి(నెల్లూరు), అనంతపురం టీడీపీ నాయకుడు పూల నాగరాజు(కడప) నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీ ఎండీ, రవాణా, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులకు స్థానం కల్పిస్తూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏఎ్‌సఆర్టీయూ ఈడీ, సీఐఆర్‌టీ డైరెక్టర్‌, రోడ్‌ సేఫ్టీ డైరెక్టర్‌, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌కు ఆర్టీసీ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వం చోటు కల్పించింది. ప్రజా రవాణా శాఖ నుంచి అడిషనల్‌ కమిషనర్‌(అడ్మిన్‌), ఆర్థిక సలహాదారుకు అవకాశం ఇచ్చింది. మహిళలకు ఉచిత ప్రయాణం, సిబ్బంది ఆరోగ్య సమస్యలు, కారుణ్య నియామకాల భర్తీ తదితర అంశాలపై త్వరలో పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని చైర్మన్‌ కొనకళ్ల నారాయణ తెలిపారు.


వలస పోయిన పక్షులు

ఏటా కొత్త సంవత్సరం వచ్చేసరికి బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలెం విదేశీ పక్షుల కిలకిలారావాలతో సందడిగా ఉండేది. నైజీరియా నుంచి గుంపులు గుంపులుగా వచ్చే పక్షులు.. ఈ ఊళ్లోని చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకొని, గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి తీసుకెళ్లేవి. అయితే గ్రామంలో పెద్ద పెద్ద చెట్లు తగ్గిపోయాయి. సరైన వసతి లేక గతేడాది నుం చి పక్షులు రావడం లేదు. ఇవన్నీ అద్దంకి మండలం మైలవరం వెళుతున్నాయి. మైలవరం చెరువు వద్ద ఉన్న చెట్లన్నీ విదేశీ పక్షులతో నిండిపోయాయి.

- అద్దంకి, ఆంధ్రజ్యోతి


ఈ వార్తలు కూడా చదవండి:

Nara Lokesh : జగన్‌ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..

Updated Date - Feb 06 , 2025 | 04:42 AM