Share News

AP School Education: పాఠశాలల్లో క్లస్టర్‌ అకడమిక్‌ టీచర్ల విధానం

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:44 AM

బదిలీల తరువాత మిగిలిన టీచర్లను క్లస్టర్‌ అకడమిక్‌ టీచర్లుగా నియమించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సెలవుల్లో ఉన్న రెగ్యులర్‌ టీచర్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు వీరి సేవలు వినియోగించనున్నారు.

AP School Education: పాఠశాలల్లో క్లస్టర్‌ అకడమిక్‌ టీచర్ల విధానం

పాఠశాల విద్యాశాఖ కొత్తగా క్లస్టర్‌ అకడమిక్‌ టీచర్ల విధానం ప్రవేశ పెట్టనుంది. బదిలీల అనంతరం మిగులుగా ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలను క్లస్టర్‌ అకడమిక్‌ టీచర్లుగా గుర్తిస్తుంది. వారిని కస్టర్లకు కేటాయించి, ఆ క్లస్టర్‌ పరిధిలోని పాఠశాలల్లో రెగ్యులర్‌ టీచర్లు సెలవు పెడితే వీరి సేవలను వినియోగించుకోనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మేలో టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 04:44 AM