Share News

AP Bar Council: న్యాయవాదుల జాబితా నుంచి 17 మంది తొలగింపు

ABN , Publish Date - May 14 , 2025 | 05:01 AM

తప్పుడు విద్యా సర్టిఫికెట్లు సమర్పించిన 17 మంది న్యాయవాదులను ఏపీ బార్‌ కౌన్సిల్‌ జాబితా నుంచి తొలగించింది. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సిఫారసుల మేరకు వీరిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

AP Bar Council: న్యాయవాదుల జాబితా నుంచి 17 మంది తొలగింపు

తప్పుడు సర్టిఫికెట్లతో ఎన్‌రోల్‌ అయిన వారిపై చర్యలు

నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏపీ బార్‌ కౌన్సిల్‌

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): నకిలీ/తప్పుడు ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్లతో ఎన్‌రోల్‌ అయిన 17 మంది న్యాయవాదులపై ఏపీ బార్‌ కౌన్సిల్‌ వేటు వేసింది. వారి పేర్లను న్యాయవాదుల జాబితా నుంచి తొలగిస్తూ బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి పద్మలత నోటిఫికేషన్‌ జారీచేశారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన వారికి నోటీసులు జారీ చేసి, వారి వివరణ తీసుకునేందుకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అవకాశం ఇచ్చిందని, ఆ తర్వాతే వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని ఏపీ బార్‌ కౌన్సిల్‌కు సిఫారసు చేసిందని పద్మలత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని ఎన్‌రోల్‌మెంట్‌ కమిటీ ఆదేశించిందని తెలిపారు. జాబితా నుంచి తొలగించిన వారిలో.. చాముండేశ్వరి (గుంటూరు జిల్లా తెనాలిలో ప్రాక్టీస్‌), చింతకాయల సీఎఎ్‌సఎన్‌ మూర్తి (తూర్పుగోదావరి జిల్లా తుని), సీడీ పురుషోత్తం (అనంతపురం), డి రత్నకుమారి (ఏపీ హైకోర్టు), కందుకూరి విశ్వక్‌ (పశ్చిమగోదావరి జిల్లా, నిడదవోలు), నక్కెళ్ల సత్యవతి (విశాఖపట్నం), గేదెల రాజశేఖర్‌ (విశాఖపట్నం), చాగలమర్రి సిద్దయ్య (ప్రకాశం జిల్లా దర్శి), డేగ సాయి వెంకట సుమన్‌ (నెల్లూరు), ఎల్లపు నవీన్‌ (విశాఖపట్నం), తాళ్లూరు వెంకట రమణయ్య (నెల్లూరు), ఎం ప్రవీణ (విశాఖ జిల్లా గాజువాక), యడల సురేశ్‌బాబు (గుంటూరు), కురుపూడి సత్యనారాయణ (రాజమహేంద్రవరం), జి సుబ్రహ్మణ్యం (చిత్తూరు జిల్లా పలమనేరు), ఎంవీ మహేశ్వరరావు (విశాఖపట్నం), పి పద్మప్రియ (ఏపీ హైకోర్టు) ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 05:01 AM