Share News

AP Bar Council: సీనియర్‌ న్యాయవాదిపై దాడి ఆందోళనకరం

ABN , Publish Date - Apr 20 , 2025 | 06:32 AM

బెంగళూరులో సీనియర్‌ న్యాయవాది వైఆర్‌ సదాశివరెడ్డిపై దాడిని ఏపీ బార్‌ కౌన్సిల్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన న్యాయవాదుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది, న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాలని ఆవేదన వ్యక్తం చేసింది

AP Bar Council: సీనియర్‌ న్యాయవాదిపై దాడి ఆందోళనకరం

  • బెంగళూరులో సదాశివరెడ్డిపై దాడి.. ఖండించిన ఏపీ బార్‌ కౌన్సిల్‌

బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కో చైర్మన్‌, కర్ణాటక బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది వైఆర్‌ సదాశివరెడ్డిపై దాడిని ఏపీ బార్‌ కౌన్సిల్‌ తీవ్రంగా ఖండించింది. బెంగళూరులోని కార్యాలయ ఆవరణలోనే సీనియర్‌ న్యాయవాదిపై కక్షిదారుడు ఇనుప రాడ్డుతో దాడి చేయడం న్యాయవాద సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. ఈ ఘటన న్యాయవాదుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరింది. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించిన ముసాయిదా అడ్వొకేట్‌ ప్రొటెక్షన్‌ బిల్‌ను తక్షణం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని కేంద్రాన్ని కోరింది. సదాశివరెడ్డి, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. దాడికి బాధ్యులైనవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బెంగళూరు పోలీసులను కోరింది.

Updated Date - Apr 20 , 2025 | 06:34 AM