Share News

Anganwadi workers: 20న అంగన్వాడీల సమ్మె

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:41 AM

ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ప్రకటించిన ప్రకారం మే 20న అంగన్వాడీ వర్కర్స్‌ పెద్ద ఎత్తున సమ్మె చేయనున్నారని తెలిపారు. వేతనాల పెంపు, ట్యాబ్‌లు ఇవ్వాలని, బాల సంజీవని యాప్‌లో మార్పులు చేయాలని డిమాండ్‌ చేశారు.

Anganwadi workers: 20న అంగన్వాడీల సమ్మె

వేతనాల పెంపు, బాలసంజీవని యాప్‌లో మార్పులకు డిమాండ్‌

సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలనీ విజ్ఞప్తి

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీలకు వేతనాల పెంపు, మినీలను మెయిన్‌ అంగన్వాడీలుగా మార్చే జీవో వెంటనే ఇవ్వాలని, బాల సంజీవని యాప్‌లో మార్పులు చేయాలని, అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలనే డిమాండ్లతో మే 20న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేయనున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బేబిరాణి, సుబ్బరావమ్మ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన యూనియన్‌ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బాల సంజీవని యాప్‌లో 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు ఫొటో క్యాప్చర్‌ తీసేయాలని, ప్రస్కూల్‌ పిల్లలకు ఫొటో ఆధారంగా రేషన్‌ ఇవ్వాలనే నిబంధనలు తొలగించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపారు. అంగన్వాడీ వర్కర్లకు, మినీ వర్కర్లకు ఫేస్‌ యాప్‌ ఇన్‌, ఔట్‌ లొకేషన్‌ తీసివేయాలని, లబ్ధిదారులకు అందిస్తున్న సరుకులన్నీ ఒకేసారి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సెంటర్‌ నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని, వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోరకు అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. కార్మిక కోడ్స్‌, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు మే 20న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించాయని, ఆ సమ్మెలో అంగన్వాడీలు పాల్గొని జయప్రదం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 04:41 AM