Share News

మరో పథకం రెడీ.. వారి ఖాతాల్లో పడనున్న డబ్బులు..

ABN , Publish Date - Jun 14 , 2025 | 09:11 AM

Annadata Sukhibhava Scheme: పథకం మొదటి విడతలో భాగంగా అర్హులైన ఒక్కో రైతు ఖాతాలో 7 వేల రూపాయలు జమకానున్నాయి. రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు జమకానున్నాయి. మూడో విడతలో 6 వేల రూపాయలు జమ అవుతాయి.

మరో పథకం రెడీ.. వారి ఖాతాల్లో పడనున్న డబ్బులు..
Annadata Sukhibhava Scheme

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తోంది. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. ప్రతీ విద్యార్థికి 13 వేల రూపాయల చొప్పున.. వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసింది. ఇంట్లో ఎంత మంది ఉంటే.. అంతమంది విద్యార్థులకు పథకం వర్తించింది.


పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలోని రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేయనుంది. ఈ నెల 20వ తేదీన ఈ పథకం అమలు అవ్వనుంది. పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు. కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6 వేలకు..


రాష్ట్ర ప్రభుత్వం మరో 14 వేల రూపాయలు కలిపి.. 20 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయనుంది. మొత్తం మూడు విడతల్లో ఈ మొత్తం జమ కానుంది. పథకం మొదటి విడతలో భాగంగా అర్హులైన ఒక్కో రైతు ఖాతాలో 7 వేల రూపాయలు జమకానున్నాయి. రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు జమకానున్నాయి. మూడో విడతలో 6 వేల రూపాయలు జమ అవుతాయి.


ఇవి కూడా చదవండి

ఆ పైలట్ విక్రాంత్ బంధువంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన హీరో

15 ఏళ్ల తర్వాత కలిశారు.. విమానం విషాదం మిగిల్చింది..

Updated Date - Jun 14 , 2025 | 10:42 AM